మాస్టర్ ప్లాన్ రద్దు కోసం Dubaiలో నిరసన

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-16 05:45:00  IST  )

మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని దుబాయ్‌లో నిరసన చేపట్టారు.

మాస్టర్ ప్లాన్ రద్దు కోసం Dubaiలో నిరసన
X

దిశ,జగిత్యాల రురల్ : మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని దుబాయ్‌లో నిరసన చేపట్టారు. జగిత్యాల రూరల్ మండలం‌లోని నర్సింగపూర్, తిమ్మాపూర్ గ్రామంలోని వ్యవసాయ భూములు మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఇండస్ట్రియల్ జోన్‌‌కు కేటాయించినందున దుబాయ్‌లో ఉన్న వలస కార్మికులు నిరసన తెలుపుతున్న ఆయా గ్రామ ప్రజల‌కు మద్దతు‌గా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ నుండి తమ భూములను తొలగించాలని డిమాండ్ చేసారు. అదే విధంగా అర్బన్ మండలం‌లోని తిప్పన్న పేట్ గ్రామానికి చెందిన 2వ వార్డు మెంబర్ బొగు సత్యం తన పదవి‌కి రాజీనామా చేసారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తన వార్డు, గ్రామ ప్రజల ఆందోళనలకు మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story