సునీత రావుపై చర్యలు తీసుకోవాలి.. గాంధీ‌భవన్ మెట్లపై మహిళా కాంగ్రెస్ నిరసన

by Ramesh Naini |

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ పై ఇటీవల రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

సునీత రావుపై చర్యలు తీసుకోవాలి.. గాంధీ‌భవన్ మెట్లపై మహిళా కాంగ్రెస్ నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ (Mahesh Kumar Goud)పై ఇటీవల రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు (Woman Congress President Sunitha Rao) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని గాంధీభవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదురుగా ఇటీవల ధర్నా నిర్వహించారు. అధిష్టానం, కాంగ్రెస్ నేతను తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఆమె తెలంగాణ కాంగ్రెస్‌ లీడర్లపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సునీతరావుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ (మంగళవారం) గాంధీభవన్ మెట్లపై సునీతరావుకు వ్యతిరేకంగా గోషామహల్ డివిజన్ మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. సునీత రావు హటావో కాంగ్రెస్ గోషామహల్ బచావ్ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సునీత రావు పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ గోషామహల్ కంటెస్టెడ్ కార్పొరేటర్లు, నాయకులు అధిష్టానానికి లేఖ రాశారు.

(Gandhi Bhavan) గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌పై అనుచిత వాఖ్యలు చేసి.. ధర్నా చేశారని లేఖలో పేర్కొన్నారు. ఆమెకు పార్టీలో ప్రధానమైన పదవి ఇచ్చి.. గోషామహాల్ ఎమ్మెల్యే టికెట్, డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయం చేశారని గుర్తుకు చేశారు. కానీ, ఆమె మాత్రం గోషామహాల్ నియోజకవర్గంలో ఒక్క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కంటెస్టేడ్ కార్పోరేటర్లను కలవలేదని, నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పట్టించుకునే కార్యక్రమం చేయలేదన్నారు.

కనీసం కాంగ్రెస్‌కు ప్రచారం సైతం చేయకుండా డబ్బులు తీస్కోని ఇంట్లో కూర్చోని నేడు నీతులు చెబుతుంటే శోచనీయం గా ఉందని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందంలో ఉందని ఆరోపించారు. నేను గాంధీభవన్‌లో ధర్నా చేస్తా, మీకు దమ్ముంటే ఏం చేస్తారో చేస్కోండి అని టీవీల్లో వ్యాఖ్యలు సైతం చేసిందని ఆరోపించారు. పార్టీలో ఉండి పార్టీని విమర్శించడం తగదని, ఆమెను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

Next Story