Central Library: చిక్కడపల్లి లైబ్రరీ వద్ద మొదలైన ఆందోళన.. బీఆర్ఎస్వీ నేతలు అరెస్ట్

by Ramesh Naini |

గ్రూప్-1 అవకతవకలపై గురువారం అశోక్ నగర్ (చిక్కడపల్లి) సెంట్రల్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి ప్రభుత్వానికి, పబ్లిక్ కమిషన్ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

Central Library: చిక్కడపల్లి లైబ్రరీ వద్ద మొదలైన ఆందోళన.. బీఆర్ఎస్వీ నేతలు అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 (Group-1) జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 అవకతవకలపై గురువారం అశోక్ నగర్ (చిక్కడపల్లి) సెంట్రల్ లైబ్రరీ వద్ద (BRSV) బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి ప్రభుత్వానికి, పబ్లిక్ కమిషన్ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా కార్యకర్తలను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను తిరిగి నిర్వహించడంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష నిర్వాహణలో (TGPSC) టీజీపీఎస్‌సీ విఫలమైంది కాబట్టి.. నైతిక బాధ్యత వహిస్తూ కమిషన్ చైర్మన్, అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హైకోర్టు తీర్పు మేరకు గ్రూప్-1 పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ వైఫల్యం కారణంగా గ్రూప్-1 అభ్యర్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, పరీక్ష నిర్వహణలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నందున హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరపాలని, తెలుగు మీడియం విద్యార్థులకు పేపర్ వాల్యుయేషన్లో తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు. అలాగే, తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా డిమాండ్ చేశారు.

Next Story