- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల మార్కెట్ శంకుస్థాపనలో మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ
ఆదిభట్ల సర్కిల్ తొర్రూరు డివిజన్ పరిధిలోని కోహెడలో హోల్సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది.

దిశ, తుర్కయంజాల్ : ఆదిభట్ల సర్కిల్ తొర్రూరు డివిజన్ పరిధిలోని కోహెడలో హోల్సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. కోహెడలో తెలంగాణ మత్స్యకారుల, మత్స్య కార్మికుల సంఘం నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. చేపలు, రొయ్య పిల్లల కొనుగోలుకు సంబంధించిన నిధులను నేరుగా మత్స్య సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, మత్సకారుల జీవిత భద్రతకు ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేషియా 20 లక్షల రూపాయలు కేటాయించాలని, అర్హులైన ప్రతి మత్స్య కారులకు సబ్సిడీలో టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను అమలు చేయాలని, మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని కోరారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో శంకుస్థాపన కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కార్యక్రమం కొనసాగగా, అరెస్టు చేసిన ఆందోళనకారులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.






