- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హామీలు గాలికి.. బకాయిలు పెండింగ్‌లో: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ధ్వజం
తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు ఇవాళ ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆరు నెలల్లోపు పీఆర్సీ (PRC) అమలు చేస్తామన్న కాంగ్రెస్, ఇప్పటికీ ఆ మాట ఎత్తడం లేదని విమర్శించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS) రద్దు చేసి, పాత పెన్షన్ స్కీం (OPS) పునరుద్ధరిస్తామన్న హామీని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఉద్యోగుల హెల్త్ స్కీం అమలు కావడం లేదని, రిటైర్మెంట్ బకాయిలు, వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ఐదు కరువు భత్యం (DA) వాయిదాలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని కవిత మండిపడ్డారు.
నిరసనలకు సంపూర్ణ మద్దతు..
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇవాళ మధ్యాహ్న భోజన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు చేపట్టే నిరసన ప్రదర్శనలకు తెలంగాణ జాగృతి తరపున తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా కవిత ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు.






