- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : మాట ఇచ్చారు..అమలు చేస్తారు : బోరెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు (Elections Promises) ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నారని సీఎం సీపీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి(Boreddy Ayodhya Reddy)ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు (Elections Promises) ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నారని సీఎం సీపీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి(Boreddy Ayodhya Reddy)ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. బాధ్యత ఉన్న నాయకుడు ఇచ్చిన మాటను గుర్తు చేసే దాకా ఆగరని.. ప్రజలకు మాట ఇచ్చారని..ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, గత బీఆర్ఎస్ పాలకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తలకు మించిన అప్పుల పాపం నెత్తిన మోపినా.. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే ఉంటారని బోరెడ్డి పేర్కొన్నారు.
అధికారం లేకుంటే ప్రజలు సంతోషంగా ఉండొద్దని కోరుకుంటున్న కురుచ, స్వార్ధ నేతలకు జీర్ణం కాకపోయినా సరేనని..పిల్లి శాపాలకు ఉట్టి తెగిపడ్తదా..? అని బీఆర్ఎస్ నాయకుల వైఖరిని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ కాంగ్రెస్ కు తెలంగాణ స్థిర అభివృద్ధి, సంక్షేమమే అంతిమం లక్ష్యమని గుర్తు చేశారు. ఆర్థిక పరమైన అవరోధాలు ఎన్ని ఉన్నా రిపబ్లిక్ డే నుంచి నాలుగు సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలను అమలును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని గుర్తు చేశారు.






