- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేద విద్యార్థిని చదువుకు రూ.లక్ష ఆర్థిక సహాయం
నాగిరెడ్డిపేట్ గ్రామానికి చెందిన సాతెల్లి శ్రావణి అనే విద్యార్థినికి ఎంసీఏ చదువుల నిమిత్తం లొంకలపల్లి గ్రామానికి చెందిన కిషోర్ రెడ్డి(ఎన్ఆర్ఐ) కేటీఆర్ జన్మదిన సందర్బంగా లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.

దిశ, నాగిరెడ్డిపేట్: మండలంలోని నాగిరెడ్డిపేట్ గ్రామానికి చెందిన సాతెల్లి శ్రావణి అనే విద్యార్థినికి ఎంసీఏ చదువుల నిమిత్తం లొంకలపల్లి గ్రామానికి చెందిన కిషోర్ రెడ్డి(ఎన్ఆర్ఐ) కేటీఆర్ జన్మదిన సందర్బంగా లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా అట్టి చెక్కును శుక్రవారం మండల కేంద్రంలోని రాంప్రతాప్ థియేటర్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థినికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోతున్న లేదా ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థిని ప్రోత్సహం అందించిన కిశోర్ రెడ్డిని పలువురు అభినందించారు. ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేసిన కిషోర్ రెడ్డికి శ్రావణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, మాజీ ఏఎంసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్,మెట్లకుంట తండా సర్పంచ్ బాల్య నాయక్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






