రాష్ట్రంలో పీక్స్‌కు చేరిన ప్రాజెక్ట్ వార్.. అధికార, విపక్షల మధ్య ప్రజెంటేషన్ యుద్ధం

by Kema Shiva Kumar |

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశం ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.

రాష్ట్రంలో పీక్స్‌కు చేరిన ప్రాజెక్ట్ వార్.. అధికార, విపక్షల మధ్య ప్రజెంటేషన్ యుద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశం ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ (BRS) మధ్య ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ వార్ పీక్స్‌కు చేరింది. ఈ మేరకు ఇవాళ నీటీ పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మధ్యాహ్నం 12 గంటలకు ‘నీళ్లు-నిజాలు’ శీర్షికన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం, ఒప్పందాల్లో జరిగిన లోపాలను, ఆర్థిక నష్టాలను ప్రజల ముందు ఉంచడమే లక్ష్యంగా ఈ పీపీటీ కొనసాగనుంది. మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ పూర్తయిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నదీ జలాల వినియోగం, రాష్ట్ర ప్రయోజనాలపై కీలక ప్రసంగం చేయనున్నట్లుగా తెలుస్తోంది.

బీఆర్ఎస్ ప్రతివ్యూహం..

ఇక మరోవైపు ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), శాసనసభా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) రంగంలోకి దిగబోతున్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, ప్రాజెక్టుల పూర్తిని అడ్డుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. సాగునీరు, ప్రాజెక్టుల అంశంపై ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నదీ జలాలపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం.

Next Story