- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశాల్లో ఉద్యోగం పేరుతో ఎర... సైబర్ మోసాలు చేయాలని నిర్భంధం
విదేశాల్లో ఉద్యోగాలంటూ గాలం వేసి వారితో సైబర్ నేరాలు చేయించిన కేసు లో తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు మోసగాళ్ళను శనివారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసారు.

దిశ, సిటీ క్రైం: విదేశాల్లో ఉద్యోగాలంటూ గాలం వేసి వారితో సైబర్ నేరాలు చేయించిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు మోసగాళ్ళను శనివారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసారు. సైబర్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...హైదరాబాద్ జీడిమెట్లకు కొలగంటి నాగ శివ, గుజరాత్ కు చెందిన హితేష్ లు అమాయక నిరుద్యోగ యువతకు కంబోడియా, లావోస్, మయాన్మార్ దేశాల్లో ఉద్యోగాలంటూ వారిని అక్కడికి తీసుకువెళ్లి సైబర్ మోసాలు చేయాలని నిర్భంధించి వేధించిన కేసుల్లో ఈ ఇద్దరిపై నిజామాబాద్ తో పాటు మరికొన్ని పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.
పరారిలో ఉన్న కొలగంటి నాగ శివ కోల్ కతా విమానాశ్రయంలో దిగినప్పుడు ఏల్ఓసి ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. మయాన్మార్ నుంచి కొంత మంది మంది అమాయక బాధితులను వెనక్కి వచ్చేలా చేసారు. వారితో హితేష్ ఢిల్లీ వచ్చినట్లు తెలుసుకుని టీజీసిఎస్బి అధికారులు అతనిని అరెస్ట్ చేసారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఎవరిని వదిలిపెట్టమని, ఎక్కడ ఉన్నా పట్టుకొస్తామని సైబర్ సెక్యూరిటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
- Tags
- cyber crimes






