- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోఠి కాల్పుల కేసులో పురోగతి.. ఎట్టకేలకు నిందితుల గుర్తింపు
కోఠిలోని ఎస్‌బీఐ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కోఠి (Koti)లోని ఎస్‌బీఐ (SBI) కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అయితే, ఈ మేరకు నిందితులను పట్టుకునేందుకు మొత్తం 5 స్పెషల్ టీమ్స్‌ను డిప్లాయ్ చేశారు. అయితే, తాజాగా వారు నిందితులను కూడా గుర్తించారు. నిందితుల్లో ఒకరు పాత నేరస్థుడేనని ధృవీకరించారు. సెల్‌ఫోన్ టవర్ డంపింగ్ ద్వారా మొబైల్ నెంబర్ కూడా సంపాదించారు. వారిని పట్టుకునేందుకు ఇప్పటి వరకు నగర పరిధిలోని 800కు పైగా సీసీ కెమెరాను పరిశీలించనట్లుగా పోలీసులు వెల్లడించారు. కానీ, నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది.
కాగా, కోఠి సుల్తాన్ బజార్ పరిధిలోని ఎస్‌బీఐ (SBI) కార్యాలయం వద్ద కొంతమంది దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులకు తెగబడ్డారు. ఉదయం 7 గంటల ప్రాతంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిషద్ (Rishad) అనే వ్యక్తిపై కాల్పులు జరిపి ఏకంగా రూ.6 లక్షల నగదుతో ఉడాయించారు. ఈ దాడిలో రిషద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు సుల్తాన్ బజార్ (Sultan Bazar) పోలీసులు రంగంలోకి దిగారు.






