- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SLBC Tunnel: సహాయక చర్యల్లో కీలక పురోగతి
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం(SLBC Tunnel)లో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా చేపట్టిన సహాయక చర్య(Rescue Operations)ల్లో కీలక పురోగతి కనిపించింది.

దిశ, వెబ్‌డెస్క్/అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం(SLBC Tunnel)లో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా చేపట్టిన సహాయక చర్య(Rescue Operations)ల్లో కీలక పురోగతి కనిపించింది. మరమ్మతుల తర్వాత కన్వేయర్ బెల్ట్(Conveyor Belt) తిరిగి పనిచేస్తున్నట్లు సమాచారం. సొరంగం కూలినప్పుడు ఈ బెల్ట్ పాడైపోయిన విషయం తెలిసిందే. దీంతో రెండ్రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన ఇంజినీర్లు ఎట్టకేలకు మంగళవారం రీస్టార్ట్ చేశారు. సొరంగంలో మట్టి తవ్వకంలో ఈ కన్వేయర్ బెల్ట్ అత్యంత కీలకంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.
బెల్ట్ సెట్ కావడంతో టన్నెల్‌లో బురద, మట్టి తొలగింపుతో పాటు సహాయక చర్యల్లో వేగం పెరగనుంది. మరోవైపు.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు పలువిధాలా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా.. ఐదుచోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్నభాగంలో ఐదు మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది భావిస్తున్నారు.






