ఫార్ములా ఈ-రేస్ కేసులో పురోగతి.. విజిలెన్స్ కమిషన్‌కు చేరిన ఏసీబీ నివేదిక

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-13 06:15:37  IST  )

ఫార్ములా ఈ-రేసు (Formula E-Race Case) కోసం కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఫార్ములా ఈ-రేస్ కేసులో పురోగతి.. విజిలెన్స్ కమిషన్‌కు చేరిన ఏసీబీ నివేదిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race Case) కోసం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఏసీబీ (ACB) నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ రిపోర్టును తాజాగా విజిలెన్స్ కమిషన్ (Vigilance Commission) వద్దకు చేరింది. అయితే, మరో రెండు రోజుల్లో ఫైల్‌పై తుది నిర్ణయం తీసుకుని విజిలెన్స్ కమిషన్ సర్కార్‌కు ఫార్ములా ఈ-రేసు కేసు తుది నివేదికను అందజేయనుంది. అక్కడి ఆమోదం వచ్చిన వెంటనే నిందితులపై చార్జీషీటు దాఖలుకు చేసేందుకు తిరిగి నివేదిక ఏసీబీకి చేరనుంది.

కాగా, ఫార్ములా ఈ-రేసు కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు A4, A5 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ను మూడు సార్లు ఏసీబీ ప్రశ్నించింది. అయితే, ఫార్ములా ఈ-కారు రేస్‌లో భారీగా అవినీతి జరిగినట్లుగా ఏసీబీ తేల్చింది. కేసులో క్విడ్‌ ప్రోకోను అధికారులు స్పష్టమైన సాక్షాధారాలతో నిరూపించినట్లుగా సమాచారం. ఫార్ములా ఈ-రేసు కోసం స్పాన్సర్‌షిప్‌ చేసిన సంస్థ నుంచి రేసు నిర్వహించిన సంస్థకు రూ.44 కోట్లు చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించారు. అందుకు బదులుగా సదురు స్పాన్సర్‌షిప్‌ సంస్థ నుంచి రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్‌‌ను బీఆర్ఎస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Next Story