Singareni : రిటైర్డు సింగరేణి కార్మికులకు లాభాల వాట 33కోట్లు మంజూరీ

by Y. Venkata Narasimha Reddy |

ఉద్యోగ విరమణ పొందిన సింగరేణి(Singareni) కార్మికులకు 33 కోట్ల రూపాయల లాభాల వాటా(Special Incentive) మంజూరైంది.

Singareni : రిటైర్డు సింగరేణి కార్మికులకు లాభాల వాట 33కోట్లు మంజూరీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఉద్యోగ విరమణ పొందిన సింగరేణి(Singareni) కార్మికులకు 33 కోట్ల రూపాయల లాభాల వాటా(Special Incentive) మంజూరైంది. ఈనెల 12న కార్మికుల ఖాతాల్లో లాభాల వాటా సొమ్ము జమ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల్లో దసరా బోనస్‌గా కార్మికులకు 33 శాతం వాటా లాభాల బోనస్‌ను ప్రభుత్వం ఇది వరకే ప్రకటించి పంపిణీ చేసింది.

ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభాలు రూ.4,701 కోట్లు కాగా ఇందులో రూ.2,412 కోట్లలో 33 శాతం కింద రూ.796 కోట్లను కార్మికులకు పంచారు. ప్రభుత్వ నిర్ణయంతో లాభాల వాటా కింద ఒక్కో కార్మికునికి సగటున రూ.లక్షా 90వేలు బోనస్‌గా అందాయి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్టు, ఒప్పంద కార్మికులకు కూడా రూ.5వేల బోనస్ అందించారు. తాజాగా రిటెర్డు కార్మికులకు కూడా లాభాల వాటను 33శాతం మంజూరీ చేసి పంపిణీకి ఏర్పాట్లు చేసింది.

Next Story