- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతి... మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ (Prabhanjan Yadav) మృతి పట్ల బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ (Prabhanjan Yadav) మృతి పట్ల బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టు మేధావిగా, యాక్టివిస్ట్‌గా ప్రభంజన్ యాదవ్ చేసిన కృషిని మరువలేనిదని అన్నారు. ఢిల్లీ (Delhi)లో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రభంజన్ యాదవ్ ఉద్యమ నిబద్ధత గొప్పదని కొనియాడారు. మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ సామాజిక తాత్విక ఆలోచనా దృక్పథంతో, బీసీ కులాల హక్కులు, పురోగతి కోసం నిత్యం తపించే ప్రభంజన్ యాదవ్ మరణంతో తెలంగాణ ఒక గొప్ప తాత్వికున్ని, సామాజిక ఉద్యమకారుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు మాజీ సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






