కేసులకు, అరెస్ట్‌లకు భయపడను: ప్రొఫెసర్ నాగేశ్వర్

by Ajay Maddhiboyina |

జ‌న‌సేన ఫిర్యాదుతో త‌న‌పై న‌మోదైన కేసుల‌పై ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు స్పందించారు. కేసుల‌కు, అరెస్టుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని అన్నారు. 30ఏళ్ల వ‌య‌సులోనే దేనికీ భ‌య‌ప‌డ‌లేద‌ని, ఇప్పుడు 62ఏళ్ల వ‌య‌సులో అరెస్ట్ ల‌కు అస‌లు భ‌య‌ప‌డేదిలేద‌ని చెప్పారు.

కేసులకు, అరెస్ట్‌లకు భయపడను: ప్రొఫెసర్ నాగేశ్వర్
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌న‌సేన ఫిర్యాదుతో త‌న‌పై న‌మోదైన కేసుల‌పై ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు స్పందించారు. కేసుల‌కు, అరెస్టుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని అన్నారు. 30ఏళ్ల వ‌య‌సులోనే దేనికీ భ‌య‌ప‌డ‌లేద‌ని, ఇప్పుడు 62ఏళ్ల వ‌య‌సులో అరెస్ట్ ల‌కు అస‌లు భ‌య‌ప‌డేదిలేద‌ని చెప్పారు. త‌న వ‌ద్ద‌కు అరెస్ట్ చేసేందుకు కూడా ఎవ‌రూ రాలేద‌ని తెలంగాణ పోలీసులు వ‌స్తే వాళ్ల‌ని ఏపీ పోలీసులు అనుకుని సోష‌ల్ మీడియాలో వైరల్ చేశార‌ని అన్నారు. ఏపీ పోలీసులు హైద‌రాబాద్ వ‌చ్చి ఉంటారేమో కానీ త‌న ఇంటికి మాత్రం రాలేద‌ని చెప్పారు. కానీ ఏపీ ప్ర‌భుత్వ‌మే త‌నపై నేరుగా కేసులు పెట్టింద‌ని అన్నారు. అయితే ఆ కేసుల్లో కుల చిచ్చు పెట్టిన‌ట్టు ఫిర్యాదు చేశార‌ని అస‌లు తాను కులాల గురించే మాట్లాడ‌లేద‌ని చెప్పారు.

ఒక అంశం వ‌చ్చిన‌ప్పుడు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తార‌ని అన్నారు. అవి ఏ ప్రాంతంవాళ్లైనా చెప్పొచ్చ‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్య‌క్తి ఏపీ రాజ‌కీయాల గురించి మాట్లాడ‌టం ఏంటని అడుగుతున్నార‌ని, తాను అమెరికా రాజ‌కీయాల గురించి కూడా మాట్లాడుతున్నాన‌ని అన్నారు. మీ గురించి మాట్లాడొద్దు అంటే మ‌రి తెలంగాణ‌లో ఎందుకు ఉంటున్నార‌ని ప్ర‌శ్నించారు. అల్ల‌ర్లు సృష్టిస్తున్నార‌ని కూడా త‌న‌పై కేసులు పెట్టార‌ని, త‌న వ్యాఖ్య‌ల‌తో రెండు దోమ‌లు కూడా చ‌నిపోలేద‌న్నారు. ఎక్క‌డ అల్ల‌ర్లు జ‌రిగాయ‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జాజీవితాన్ని డిస్ట‌బ్ చేశాన‌ని కూడా కేసులు పెట్టార‌ని, అస‌లు తాను చేసిన కామెంట్ల‌కు అలాంటి కేసులు పెట్టే అవ‌కాశ‌మే లేద‌న్నారు.

Next Story