- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సంస్థకు డిపార్ట్‌మెంటల్ హోదా కల్పించాలి: ప్రొఫెసర్ కోదండరాం
విత్తన ధ్రువీకరణ సంస్థ పాత్ర అత్యంత కీలకమని, విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం అందుతుందని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : విత్తన హబ్‌గా చెప్పుకునే తెలంగాణలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో విత్తన ధ్రువీకరణ సంస్థ పాత్ర అత్యంత కీలకమని, విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం అందుతుందని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. కల్తీల విషయంలో జవాబుదారీ తనం ఉంటుందని, సంస్థ చిన్నదైన సీడ్ సర్టిఫికేషన్ అధికారులు ఆవశ్యకత చాలా ముఖ్యమైనదన్నారు. శనివారం విత్తన ధృవీకరణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం పాల్గొని ప్రసంగించారు. సంస్థ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సాధించి, విత్తన ధృవీకరణ సంస్థకు డిపార్ట్మెంట్ హోదా కల్పిస్తూ, ట్రెజరీ నుంచి నేరుగా ఉద్యోగుల జీతాలు ఇచ్చి, సంస్థను ఆర్థిక సమస్యల నుంచి అధిగమించేలా చేయాలని కోరారు. విత్తన ధృవీకరణ కూడా సమర్థవంతంగా జరిగి, సంస్థ అనుకున్న లక్ష్యాలను సాధించి, రైతులకు నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలను అందించే అవకాశం ఉందని, త్వరలో వీటిపైన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి తుమ్మలకు లిఖిత పూర్వకంగా తెలియజేస్తానని హామీ ఇచ్చారు.
డిపార్ట్ మెంటల్ హోదా కల్పించడంతో రాష్ట్రంలో విత్తనాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఒకే పరిపాలనలోకి వచ్చి, సమగ్ర పర్యవేక్షణతో రైతులకు నాణ్యమైన ధృవీకరణ విత్తనాల సరఫరా సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే విత్తన ధ్రువీకరణ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో టెక్నికల్ స్టాఫ్ కు జీతాలు ఇస్తుందని, అదేవిధంగా, విత్తన ధృవీకరణ చార్జీల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ సంస్కరణ వలన ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉండదన్నారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త విత్తన చట్టంలో విత్తన ధ్రువీకరణ సంస్థకు ప్రత్యేకత ఉందని, రాష్ట్రంలోనే కాకుండా, దేశంలో సీడ్ సర్టిఫికేషన్ ను తప్పనిసరి చేసి, రైతులకు సర్టిఫైడ్ విత్తనాలే సరఫరా చేయాలని, విత్తన బిల్లు రాకముందే ఇప్పటికే తమిళనాడు, కేరళ, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాలు తమ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోకి తెచ్చాయని గుర్తుకు చేశారు. తమిళనాడు లాంటి రాష్ట్రంలో కేవలం సర్టిఫైడ్ వరి విత్తనాలనే రైతులకు అందించాలని, మహారాష్ట్రలో అన్ని పంటల నోటిఫైడ్ రకాలను తప్పనిసరిగా సర్టిఫికేషన్ చేయించుకోవాలని ఆయా ప్రభుత్వాలు నిబంధనలు తీసుకవచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్ ను రూ. 30 వేలకు పెంచాలని, విత్తన ధ్రువీకరణ సంస్థకు ఒక డిపార్ట్ మెంటల్ స్టేటస్ ను కల్పించి వ్యవసాయ శాఖ లో ఒక ప్రత్యేక విభాగం క్రింద చేర్చాలన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించి వారి జీతాలను పెంచాలి. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ లకు వ్యవసాయ విస్తరణ అధికారి బేసిక్ సాలరీకి సమానంగా రూ. 32 వేలకు పెంచాలని, ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువచ్చి వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తన ధ్రువీకరణ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ జయప్రకాష్, పెబ్బేటి మహేష్, రవి, పృథ్వి రాజ్ తదితరులు పాల్గొన్నారు.






