ఉప ఎన్నికలే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్-టీజేఎస్ పొత్తు: ప్రొఫెసర్ కోదండరాం

by Malleboina Mahesh |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాకుండా.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్-టీజేఎస్ మధ్య పొత్తు కొనసాగుతోందని ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు.

ఉప ఎన్నికలే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్-టీజేఎస్ పొత్తు: ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాకుండా.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్-టీజేఎస్ మధ్య పొత్తు (Congress-TJS alliance) కొనసాగుతోందని ప్రొఫెసర్ కోదండరామ్ (Professor Kodandaram) స్పష్టం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో బేటీఆయన అయిన ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్-టీజేఎస్ పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. స

స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) పోటీలో నిలిచే తమ పార్టీ నేతలకు సంబంధించిన కొంత మంది అభ్యర్థుల జాబితాను టీపీసీసీ చీఫ్ (TPCC Chief) కు ఇచ్చానని, వారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నన్నాని ఆయన మీడియాతో తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన టీజేఎస్‌ (TJS)కు భాగస్వామ్యం విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాకు చెప్పుకొచ్చారు.

Next Story