- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగస్టు 2న అగ్రికల్చర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు.

- 519 మంది విద్యార్థులకు పట్టాల ప్రధానం : రిజిస్ట్రార్విద్యాసాగర్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 519 మంది యుసీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారని ప్రకటించారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ స్నాతకోత్సవంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్జాట్ ముఖ్య అతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరగనుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 322 మంది మహిళలు, 197 మంది పురుషులు పట్టాలు అందుకోనున్నారని వారిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన 9 మంది, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా ఇద్దరు పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు రూ. 25 వేల చొప్పున నగదు బహుమతిని అందజేస్తారు. వీరితోపాటు 20 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కూడా బంగారు పతకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పాటించవలసిన సూచనలు, అడ్మిట్ కార్డు, డ్రెస్ కోడ్ వివరాలను విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in లో చూడవచ్చని సూచించారు.






