‘మావోయిస్టులు ఇంకా ఉన్నారు’.. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

మావోయిస్టు(Maoists) నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారని గతకొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

‘మావోయిస్టులు ఇంకా ఉన్నారు’.. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు(Maoists) నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారని గతకొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అభయ్ పేరుతో వచ్చిన లేఖను.. అధికార ప్రతినిధి జగన్ తప్పుబట్టడమే ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. తాజాగా మావోయిస్టు పార్టీలో విభేదాలపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌(Professor Haragopal) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీల్లో విభేదాలు అంతర్గతం అని చెప్పారు. శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినా కేంద్రం అణచివేస్తూనే ఉందని అన్నారు. ఈ వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. 2004లో కాంగ్రెస్ గెలవడానికి శాంతిచర్చలే కారణమని గుర్తుచేశారు. ఎన్నికలపై మావోయిస్టులు ప్రభావం చూపగలిగితే పార్టీలు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు తెలంగాణ సుముఖంగానే ఉంది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కూడా పాజిటివ్‌గా ఉన్నారని చెప్పారు. అందుకే రాహుల్‌పై అర్బన్‌ మావోయిస్టు ముద్రవేశారని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌లో ఇంకా మావోయిస్టులు ఉన్నారని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ స్పష్టం చేశారు.

Next Story