- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్ రాజ్యాంగం ఉందని మర్చిపోతున్నాడు: ప్రొఫెసర్ హరగోపాల్
కేంద్రమంత్రి బండి సంజయ్ రాజ్యాంగం ఉందని మర్చిపోతున్నాడని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను హరగోపాల్ ఖండించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి బండి సంజయ్ రాజ్యాంగం ఉందని మర్చిపోతున్నాడని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను హరగోపాల్ ఖండించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తననే కాకుండా రాహుల్ గాంధీని కూడా అర్బన్ మావోయిస్టు అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీని అర్బన్ మావోయిస్టు అన్నారని.. ఇంకా అర్బన్ మావోయిస్టు కానివాళ్లు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు.
సరైన ఆధారాలు లేకుండా నిందలు వేయకూడదని అన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి రాజ్యాంగం ఉందని, ఆయన వెనుక ప్రభుత్వం ఉందని మర్చిపోతున్నారని చెప్పారు. తాము ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదనికానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. ఇదిలా ఉంటే ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ.. నగరాల్లో ఉంటూ ఏసీలో కూర్చునే అర్బన్ మావోయిస్టుల వల్ల అమాయక గిరిజనులు అడవిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు.






