- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులపై దాడి మీద సమాజం స్పందించాలి.. ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపు
మావోయిస్టులపై కేంద్రం ప్రభుత్వం జరుపుతున్న ఎన్‌కౌంటర్‌లపై పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టులపై కేంద్రం ప్రభుత్వం జరుపుతున్న ఎన్‌కౌంటర్‌లపై పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal) స్పందించారు. ఇవాళ (గురువారం) సీపీఐ స్టేట్ ఆఫీస్‌లో మావోయిస్టులను ఎన్‌కౌంటర్లు ఖండింస్తూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రో. హరగోపాల్ మాట్లాడుతూ.. మావోయిస్టులను పట్టుకొని చంపినా.. రాజ్యాంగం విలువలను గౌరవిస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. ఎవర్నైనా చంపొచ్చు అనే ధోరణి కేంద్రంలో కనిపిస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా.. కేంద్రం తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను సైతం కేంద్రం లెక్క చేయడం లేదన్నారు. మావోయిస్టులపై దాడి మీద సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని, లేదంటే సమాజం పైన కూడా ఇలాంటిదే జరుగుతుందని పిలుపునిచ్చారు.
కేంద్రం చెబుతున్న అభివృద్ధి నమూనాలో మానవతా విలువలు లేవని హరగోపాల్ విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే వనరులను అప్పజెబుతామని కార్పొరేట్ లకు ఈ పాలకులు ప్రామిస్ చేశారని అన్నారు. అందుకే చెట్లు, మనుషులు అడ్డమొచ్చినా తొలగిస్తున్నారని, నాలుగు లక్షల చెట్లు తొలగిస్తున్నారు.. ప్రకృతిని, మనిషిని విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పీసా ప్రకారం ఆదివాసీల అనుమతి లేకుండా పాలకులు.. వారి ప్రాంతానికి వెళ్ళే అధికారం లేదని స్పష్టం చేశారు. కానీ వీటిని వీరు లెక్క చేయడం లేదన్నారు. ఆదివాసీల హక్కులను సైతం కాలరాస్తున్నారని, శాంతి చర్చలకు ప్రతిపాదన చేసినప్పుడు.. మేము సిద్ధమే అని మావోయిస్టులు ప్రకటించారన్నారు. గతంలో అనేక సార్లు శాంతి చర్చలు జరిగాయి.. అప్పుడు సఫలం అయిన సందర్భాలు అనేకం అని, కానీ కేంద్రం మాత్రం మొండి వైఖరితో చర్చించడం లేదన్నారు. సమస్యను ముట్టుకోకుండా... మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేస్తామంటే... సాధ్యం కాని పని అని హరగోపాల్ తెలిపారు.






