Prof. Haragopal: యూజీసీ గ్రాంట్స్ ఇవ్వకుండా రాజకీయాలు: ప్రొ.హరగోపాల్

by Prasad Jukanti |   ( Updated:2025-02-06 13:09:56.0  )
Prof. Haragopal: యూజీసీ గ్రాంట్స్ ఇవ్వకుండా రాజకీయాలు: ప్రొ.హరగోపాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యారంగంలో మార్పులు మంచివి కావని ప్రొ.హరగోపాల్ (Prof.Haragopal) అన్నారు. మార్పులు ఎందుకు చేస్తున్నారు? ఈ మార్పుల వల్ల విద్యారంగ భవిష్యత్ కు ఎలా మంచిదో ఈ దేశానికి యూజీసీ (UGC) చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూపొందించిన ముసాయిదాపై గురువారం హైదరాబాద్ లో తెలంగాణ విద్యా కమిషన్ (Telangana Education Commission) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొని మాట్లాడిన ప్రొ.హరగోపాల్.. విశ్వవిద్యాలయాలకు కావాల్సిన వనరులను సమకూర్చి యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన యూజీసీ అది తప్ప మిగిలిన పనులన్నీ చేస్తోందని విమర్శించారు. యూనివర్సిటీలకు వనరులను సమకూర్చకుండా ఈ రాజకీయాలు చేయడం మంచింది కాదన్నారు.

Advertisement
Next Story