- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మాతలు, దర్శకులు మా దగ్గరకు రావొద్దు.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 మూవీ టికెట్ రేట్లు పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ కొట్టేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 (Akhand-2) మూవీ టికెట్ రేట్లు పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు (High Court) సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ కొట్టేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అఖండ-2 టికెట్ల రేట్లు యథావిధిగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక భవిష్యత్తులో ఏ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచేది లేదని కోమటిరెడ్డి అన్నారు.
సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులెవరూ తమ వద్దకు రావొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని.. పేదల కోసమే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. హీరోలకు రూ. వందల కోట్లు రెమ్యునరేషన్లు ఎందుకివ్వాలి.. టికెట్ల రేట్లు పెంచాలని ఎందుకు ఒత్తిడి చేయాలని ప్రశ్నించారు. పేదోడు కుటుంబంతో సినిమాకు వెళ్లాలంటే టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉండాలన్నారు. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని, కానీ, ఈ సారి పొరపాటు జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడటం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.






