AI ద్వారా సినిమాల సక్సెస్‌ రేట్‌ పెరిగే అవకాశం.. నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-03 17:00:12  IST  )

హైదరాబాద్‌లో ఏఐ స్టూడియో(AI ​​Studio) ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖుల మధ్య మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) శనివారం ప్రారంభించారు.

AI ద్వారా సినిమాల సక్సెస్‌ రేట్‌ పెరిగే అవకాశం.. నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఏఐ స్టూడియో(AI ​​Studio) ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖుల మధ్య మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. టెక్రాలజీ రోజు రోజుకూ ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రపంచంలో డిజిటల్ మార్పులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏఐ ఆధారిత సినిమాలు రావడం గొప్ప పరిణామం అని అన్నారు. దీని వల్ల పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. అనంతరం నిర్మాత దిల్‌రాజు(Producer Dil Raju) మాట్లాడుతూ.. ఏఐతో దర్శకులు వేగంగా సినిమాలు తీసే అవకాశం ఉంటుందని అన్నారు. త్వరలోనే ఏఐని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు.

అసలు ఈ ఏఐ స్టూడియోను ప్రారంభించాలనే ఆలోచన రెండేళ్ల క్రితమే వచ్చిందని అన్నారు. అప్పుడే సినిమా పరంగా ఏఐ ఎంతగా ఉపయోగపడుతుందో చర్చించినట్లు తెలిపారు. ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్స్‌.. ఇలా సినిమా నిర్మాణంలో ఏఐ భాగం కానుంది. స్క్రిప్టు పూర్తయితే.. ఏఐ ద్వారా సౌండ్‌ ఎఫెక్ట్స్‌, విజువల్స్‌తో మనం సినిమా చూసేయొచ్చు. అదే మా మేజర్‌ టార్గెట్‌. భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకొస్తుంది. ఏఐ ద్వారా సినిమాల సక్సెస్‌ రేట్‌ పెరిగే అవకాశం ఉంది. దర్శక, రచయితలకు సమయం, నిర్మాతలకు డబ్బు ఆదా అవుతుంది అని దిల్‌రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు పాల్గొన్నారు.

Next Story