Tollywood: రెండ్రోజుల్లో కార్మికుల సమస్య పరిష్కారం.. చిరంజీవి‌తో నిర్మాత సి. కల్యాణ్ కీలక భేటీ

by Ramesh Naini |

టాలివుడ్‌లో సినీ కార్మికులు తమ వేతనాల పెంచాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Tollywood: రెండ్రోజుల్లో కార్మికుల సమస్య పరిష్కారం.. చిరంజీవి‌తో నిర్మాత సి. కల్యాణ్ కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలివుడ్‌లో సినీ కార్మికులు (Film workers) తమ వేతనాల పెంచాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) ప్రతినిధులు, నిర్మాతలు ఇప్పటికే కార్మిక సంఘాలతో పలు మార్లు భేటీ అయినప్పటికీ సమస్య పరిష్కారం అవ్వలేదు. దీంతో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సినీ కార్మికుల పంచాయితీ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంటికి చేరుకుంది. కార్మికుల సమ్మెపై సీన్‌లోకి చిరంజీవి (Megastar Chiranjeevi) ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం చిరంజీవితో నిర్మాత సి. కల్యాణ్ (Producer C. Kalyan) భేటీ అయ్యారు. సమావేశం అనంతరం నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్ సమస్య పరిష్కారానికి చిరంజీవి తన వంతు కృషి చేస్తున్నారని తెలిపారు. రేపు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చిరంజీవిని కలుస్తారని వెల్లడించారు. ఫెడరేషన్‌తో మాట్లాడి వారిని ఛాంబర్‌కు పంపిస్తానని చెప్పారని స్పష్టం చేశారు. ఫిల్మిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి చర్చించుకోవాలని, ఇరువైపులా పట్టు విడుపు ఉండాలని చిరంజీవి చెప్పారని వివరించారు. దీంతో రెండ్రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రొడ్యూసర్ ఉంటేనే సినిమా ముందుకు వెళ్తుందని, అందరికీ ఉపాధి దొరుకుతుందని నిర్మాత సి. కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Next Story