తెలంగాణను నిర్మించాలనేదే మా సంకల్పం: ప్రియాంక గాంధీ

by Gantepaka Srikanth |

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో వచ్చిన తీర్పు, ప్రజా సమస్యలు వినే, పాలనపై శ్రద్ధతో వ్యవహరించే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు.

తెలంగాణను నిర్మించాలనేదే మా సంకల్పం: ప్రియాంక గాంధీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో వచ్చిన తీర్పు, ప్రజా సమస్యలు వినే, పాలనపై శ్రద్ధతో వ్యవహరించే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇది సామాజిక న్యాయం, గౌరవం మరియు అందరినీ సమన్వయపరుస్తూ సాగే అభివృద్ధికి ఓటు అని ఆమె అన్నారు. ఈ విజయాన్ని సాధ్యం చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరియు నాయకుడి నిబద్ధతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.. ఈ విజయం మీకు మరియు తెలంగాణ అద్భుతమైన ప్రజలకు చెందుతుందని ప్రియాంక గాంధీ అభినందించారు. ప్రతి కుటుంబం పురోగతి మరియు అవకాశాలను పంచుకునే ప్రజా తెలంగాణను నిర్మించాలనేదే మా సంకల్పం, కొత్త బలంతో కొనసాగుతుందని ఆమె హామీ ఇచ్చారు. జై తెలంగాణ, జై కాంగ్రెస్ అంటూ ప్రియాంక గాంధీ పోస్టు చేశారు.

Next Story