దేశంలోనే అలా పని చేస్తోన్న ఏకైక CM కేసీఆర్: రేవంత్ ఇలాకాలో ప్రియాంక ఫైర్

by Satheesh |

బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడంగల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఆమె

దేశంలోనే అలా పని చేస్తోన్న ఏకైక CM కేసీఆర్: రేవంత్ ఇలాకాలో ప్రియాంక ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడంగల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఆమె హాజరయ్యారు. ఈ సంద్భరంగా ప్రియాంక మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలన అవినీతిమయం అని.. కేసీఆర్ హయంలో స్కామ్‌ల మీద స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్ట్‌ల్లో భారీగా దోపిడి జరిగిందని నిప్పులు చెరిగారు. దొరల తెలంగాణ రోజురోజుకీ బలపడుతోంది.. ప్రజల తెలంగాణ మాత్రం బలహీనపడుతోందని మండిపడ్డారు. దేశంలో ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తోన్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్ని మద్యం మత్తులో ముంచేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని.. బీఆర్ఎస్ మాత్రం ధనవంతుల పార్టీగా మారిందని ఒంటికాలిపై లేచారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. బీఆర్ఎస్‌కు బీజేపీకి సహకారం అందిస్తూనే ఉందని అన్నారు.

Next Story