- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా తండ్రి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు.. ఆ బాధేంటో నాకు తెలుసు: ప్రియాంక
ప్రజల పోరాటంతో తెలంగాణ ఏర్పడింది.. ఎందరో అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను గ్రహించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల పోరాటంతో తెలంగాణ ఏర్పడింది.. ఎందరో అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను గ్రహించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడంగల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఆమె హాజరయ్యారు. ఈ సంద్భరంగా ప్రియాంక మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నేరవేరుతాయనుకున్నాం.. కానీ పదేళ్ల ప్రజల ఆశలను కాలరాస్తూ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పదేళ్లవుతోంది.. కేసీఆర్ పాలనను పదేళ్లుగా ఎలా ఉందో చూస్తున్నామన్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు దక్కాయని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనలో ప్రజలు మరింత పేదలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు లేవు అని మండిపడ్డారు. నా కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసింది.. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాల బాధ ఏంటో నాకు తెలుసని ప్రియాంక గాంధీ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఉద్యమాల్లో అమరులైన వారి త్యాగం వృథా కాకూడదని.. అమరుల ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నేరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.






