విద్యార్థుల‌కు అల‌ర్ట్‌...నేడు ఈ జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్

by velandi.Saikiran |

హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు బంద్‌ పాటించాలని

school
X

school

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ పలు జిల్లాల్లో ప్రైవేట్ స్కూల్స్ తో పాటు కాలేజీలు మూతపడనున్నాయి. విద్యార్థి సంఘాల భౌతిక దాడులను నిరసిస్తూ, ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది వరంగల్ జిల్లా ఎయిడెడ్ అన్-ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం ( WADUPSA). హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు బంద్‌ పాటించాలని ఈ సందర్భంగా కోరింది. విద్యార్థి సంఘాల నాయకులు చందాలకు వెళ్లి, పాఠశాల యాజమాన్యంపై దాడికి దిగడంపై హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది WADUPSA. ఈ చందాల దందా నుంచి విముక్తి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. అదే సమయంలో ఇవాళ ప్రైవేట్ విద్యాసంస్థ‌లు బంద్ పాటించాల‌ని పిలుపునిచ్చింది.

Next Story