- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెలవుల్లో ప్రైవేటు జూనియర్ కాలేజీలు నడపొద్దు
రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు సెలవులు లేకుండా నిరంతరం తరగతులు నిర్వహించడంపై విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు సెలవులు లేకుండా నిరంతరం తరగతులు నిర్వహించడంపై విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి పండుగ, ఆదివారాలు, ఇతర పండుగ రోజుల్లో విద్యార్థులకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించినప్పటికీ, కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఈ నిబంధనను పాటించకపోవడంపై విద్యార్థుల నుంచి మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. విశ్రాంతి లేకపోవడం వల్ల విద్యార్థులు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారని, దీని వల్ల వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ కాలేజీలు తప్పనిసరిగా సెలవులను పాటించాలని, లేనిపక్షంలో విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఈ నిర్ణయం విద్యార్థులకు చదువుతో పాటు తగినంత విశ్రాంతిని ద్వారా, వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని కమిషన్ అభిప్రాయపడింది.
- Tags
- Women Commission






