మీనాక్షి నటరాజన్ పై మరో పిటిషన్ దాఖలు

by Naga Rani Yarlagadda |

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ పై ప్రైవేట్ కంప్లైంట్ పిటిషన్ దాఖలయింది.

మీనాక్షి నటరాజన్ పై మరో పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ పై ప్రైవేట్ కంప్లైంట్ పిటిషన్ దాఖలయింది. నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కంభం శివకుమార్ రెడ్డి తనపై వేధింపులకు పాల్పడి చంపుతానని బెదిరించినా.. ఆయనపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవడం లేదంటూ.. శ్రీలత అనే మహిళ గతంలో నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. సదరు కేసు తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ.. పిటిషన్ ను రిటర్న్ చేసింది. దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లాలని సూచించింది.

ఈ క్రమంలోనే తాజాగా.. శ్రీలత ప్రజాప్రతినిధుల కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ లో మీనాక్షి నటరాజన్ తో పాటు ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్ పై ప్రజాప్రతినిధుల కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది.

Next Story