నోటిలోకి నీళ్లు తీసుకొని, వేరే బాటిల్లోకి.. వెలుగులోకి ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్వాకం

by Ramesh Goud |

హైదరాబాద్ (Hyderabad) లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travells Bus) డ్రైవర్ (Driver) చేసిన నిర్వాకం సోషల్ మీడియా (Socisl Media) లో వైరల్ (Viral) గా మారింది.

నోటిలోకి నీళ్లు తీసుకొని, వేరే బాటిల్లోకి.. వెలుగులోకి ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్వాకం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travells Bus) డ్రైవర్ (Driver) చేసిన నిర్వాకం సోషల్ మీడియా (Socisl Media) లో వైరల్ (Viral) గా మారింది. వీడియో కథనం ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగుళూరు (Hyd To Bengulur) వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు (Passenger) ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు ఎక్కాడు. బస్సు బయలుదేరకముందే ఆ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ముందు సీట్ లో కూర్చున్న అతనికి డ్రైవర్ ముందు ఉండే రేర్ వ్యూ మిర్రర్ (Rare View Mirror) ద్వారా డ్రైవర్ చేసే పనులు కనిపిస్తున్నాయి. దీంతో ఆ డ్రైవర్ చేస్తున్న నిర్వాకం బయటపడింది.

బస్సులోని డ్రైవర్ ప్రయాణికులకు అందించే వాటర్ బాటిల్స్ (Water Bottles) నుంచి ఒక్కో బాటిల్ మూత తీసి, సగం నీటిని నోటిలోకి తీసుకొని, వేరే బాటిల్ లో నోటిలోని నీటితోనే నింపుతున్నాడు. ఇది గమణించిన ఆ ప్రయాణికుడు రేర్ వ్యూ మిర్రర్ ద్వారా వీడియో (Video) తీశాడు. దీనిపై ఆ ప్రయాణికుడు ప్రశ్నించగా.. డ్రైవర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఈ వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు (Netizens) స్పందిస్తూ.. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో చాలా మంది ఇలాంటి చేష్టలకే పాల్పడుతున్నారని, ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story