ఆదివాసీల ప్రగతికే మా ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-01 13:33:17  IST  )

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి రూ.112 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఆదివాసీల ప్రగతికే మా ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమ ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే ఇస్తామని ముందే చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు ఆసిఫాబాద్‌లో మున్సిపల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అక్కడే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభలో నిర్వహించిన మాటామంతిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీటి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను సైతం ఆదేశించామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అందుకే తండాల్లో అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. చివరగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.

Next Story