జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన 'వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ'

by Geesa Chandu |

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిని.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ 'క్రిస్టినా' సందర్శించారు. తర్వాత భువనగిరి మెడికల్ కళాశాల వైద్యాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన వైద్యశాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ
X

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిని.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ 'క్రిస్టినా' సందర్శించారు. తర్వాత భువనగిరి మెడికల్ కళాశాల వైద్యాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని వార్డులను సందర్శించారు. దీంతో పాటుగా డయాలసిస్ కేంద్రాన్ని మరియు ఇటీవల కేంద్ర ఆసుపత్రిలో కొత్తగా ప్రారంభించిన మొదటి అంతస్తు పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ తో పాటుగా పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.

Next Story