కాంగ్రెస్‌లో గెల్చిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మోడీ కరీంనగర్ బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో గెల్చిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మోడీ కరీంనగర్ బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్ని మోసం చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏ అవకాశాన్ని వదులుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీలని.. కాంగ్రెస్‌లో గెలిచిన వాళ్లు ఎప్పుడు బీఆర్ఎస్‌లో చేరుతారో తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను దోచుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అని నిప్పులు చెరిగారు. పీవీ నర్సింహరావు రూపంలో దేశానికి ప్రధానిని అందించిన నేల ఇది.. కానీ పీవీని కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కుటుంబానికి పీవీ నచ్చలేదన్నారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపించడమేనని.. అలాగే కేసీఆర్‌ను వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయకండని మోడీ పిలుపునిచ్చారు. తెలంగాణలో మార్పు కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షించిన తెలంగాణ కోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరమున్నదన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎంతో ముఖ్యమని తెలిపారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్కార్లు అవసరం లేదని, గ్యారెంటీలను నేరవేర్చే బీజేపీ ప్రభుత్వం అవసరమని అన్నారు. ఒకవైపు కేసీఆర్ ఉన్నారు.. మరో వైపు మీ సేవకుడు మోడీ ఉన్నారు.. మీరు ఆలోచించి ఓటు వేయాలన్నారు.

Next Story