Mann Ki Baat: హైదరాబాద్ విమోచన దినోత్సవంపై మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-08-31 07:15:58  IST  )

సెప్టెంబర్‌ నెలలో హైదరాబాద్ విమోచన దినం జరుపుకోబోతున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు.

Mann Ki Baat: హైదరాబాద్ విమోచన దినోత్సవంపై మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సెప్టెంబర్‌ నెలలో హైదరాబాద్ విమోచన దినం (Hyderabad Liberation Day) జరుపుకోబోతున్నామని ప్రధాని మోడీ (Narendra Modi) వెల్లడించారు. ఆదివారం (Mann Ki Baat) మన్‌ కీ బాత్ 125వ ఎపిసోడ్‌లో హైదరాబాద్ గురించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ పోలోలో పాల్గొన్న వారందరి ధైర్యాన్ని మనం గుర్తుచేసుకునే నెల సెప్టెంబర్‌ అని తెలిపారు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్‌లో నిజాం, రజాకార్ల దురాగతాలు జరిగేవి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు, వందేమాతరం చెప్పినందుకు కూడా ప్రజల్ని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై, పేదలపై దారుణాలు జరిగాయని పేర్కొన్నారు. ఆ సమయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ సమస్యపై ప్రభుత్వాన్ని హెచ్చరించారని గుర్తుకు చేశారు. చివరికి సర్దార్ పటేల్ ఈ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆపరేషన్ పోలోకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. మన దళాలు హైదరాబాద్‌ను నిజాం నియంతృత్వం నుంచి విముక్తి చేసి భారత్‌లో భాగం చేశాయి. దేశం మొత్తం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సర్ధార్ పటేల్ నాడు రేడియోలో మాట్లాడిన వ్యాఖ్యలు వినిపించారు. కాగా, ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Next Story