- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందెశ్రీని కొనియాడుతూ ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్
తెలంగాణ మట్టికవి, ప్రముఖ రచయిత అందెశ్రీ(64) సోమవారం కన్నుమూశారు. ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మట్టికవి, ప్రముఖ రచయిత అందెశ్రీ(64) సోమవారం కన్నుమూశారు. ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. తాజాగా.. అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) సంతాపం తెలిపారు. ఈ మేరకు తెలుగులో ట్వీట్ పెట్టారు. ‘‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి, ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అందెశ్రీ ఆకస్మిక మృతిపట్ల ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మోడీ ట్వీట్






