Operation Sindoor: పాక్ పై ప్రధాని మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-05-29 05:49:37  IST  )

పహెల్గాం ఉగ్రదాడి విషయంలో ప్రధాని మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Operation Sindoor: పాక్ పై ప్రధాని మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడి అని ఈ దాడిలో మన తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) రూపంలో ధీటైన సమాధానం ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Modi) అన్నారు. ఉగ్రవాదులు మనల్ని విభజించాలని చూశారని మతం ప్రాతిపదికన పాకిస్తాన్ సైతం మతం పేరుతో విభజించాలని ప్రయత్నించిందన్నారు. మనమంతా ఐక్యంగా ఉండి గట్టి బుద్ధి చెప్పామన్నారు. పాక్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశామన్నారు. సిక్కిం 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ వర్చువల్ గా తన సందేశాన్ని ప్రధాని పంపించారు. నిజానికి ఇవాళ సిక్కింలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రధాని వర్చువల్ గా సిక్కిం (Sikkim) రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సిక్కిం ను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ మార్చబోతున్నామని, సిక్కింను కేవలం భారత్ కే కాదు యవత్ ప్రపంచానికి గ్రీన్ మోడల్ స్టేట్ గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. విక్షిత్‌ భారత్‌.. పేదలు, రైతులు, మహిళలు, యువత అనే నాలుగు బలమైన పునాదులపై రూపుదిద్దుకుంటోందని చెప్పారు. సిక్కిం రైతులు వ్యవసాయంలో కొత్త ఒరవడులు సృష్టిస్తున్నారని ఇది సిక్కిం యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రశంసించారు.

Next Story