ప్రతిష్టాత్మకంగా ‘ఆటా’ మహాసభలు.. మంత్రి శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

by Kema Shiva Kumar |

అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ (ATA) 19వ మహాసభలు–యువజన సదస్సు జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అట్టహాసంగా జరగనున్నాయి.

ప్రతిష్టాత్మకంగా ‘ఆటా’ మహాసభలు.. మంత్రి శ్రీధర్‌బాబుకు ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ (ATA) 19వ మహాసభలు–యువజన సదస్సు జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అట్టహాసంగా జరగనున్నాయి. అయితే, ఈ మహా సభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును గురువారం ‘ఆటా’ అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్‌ సతీష్‌రెడ్డి, మీడియా కో-ఆర్డినేటర్ ఈశ్వర్ బండా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆటా’ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా.. డిసెంబర్ 19న హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించనున్న బిజినెస్ సెమినార్‌కు కూడా ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. ఈ సమావేశంలో అమెరికా-తెలంగాణ మధ్య వ్యాపార, సాంకేతిక, స్టార్టప్ రంగాల అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఆటా చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ‘ఆటా’ మహాసభల్లో అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజం, వ్యాపారవేత్తలు, యువ ఇన్నోవేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక వేడుకలు, యూత్ కాన్ఫరెన్స్‌లు, బిజినెస్ కాన్ఫరెన్స్‌లు, ఎన్ఆర్ఐ సదస్సులు నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు మంత్రి శ్రీధర్‌బాబుకు వివరించారు.

Next Story