రేపు నగరానికి రాష్ట్రపతి రాక

by Muthe.Rajitha |

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు.

రేపు నగరానికి రాష్ట్రపతి రాక
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళామహోత్సవ్ 2025ను ఆమె ప్రారంభిస్తారు. డిస్కవర్ ద కలర్, క్రాఫ్ట్, కల్చర్ అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా ఇన్ హైదరాబాద్ పేరిట ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక, చేనేత, జౌళి మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు తెలంగాణ, రాజస్థాన్, గోవా గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, బి హరిబాబు, పి అశోక గజపతి రాజు, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర మంత్రి సీతక్క, తదితరులు హాజరుకానున్నారు.

సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. కాగా... ఈ కార్యక్రమం ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుంది. 9 రోజుల పాటు కొనసాగే ఈ కళామహోత్సవ్ లో హస్తకళలు, జానపద, శాస్త్రీయ, సంగీత, నృత్యాలు, పర్యాటక శాఖ ప్రదర్శనలు, వివిధ రకాల వంటకాల రుచులు, సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకుల కోసం ప్రవేశం ఉచితంగా ఉంటుంది. https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/rashtrapati-nilayam-hyderabad/p2/p2 లింక్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉచితంగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

Next Story