Alai Balai: సోదరభావాన్ని పెంపొందించే వేడుక ‘అలాయ్ బలాయ్’: రాష్ట్రపతి ముర్ము సందేశం

by Ramesh Naini |

సోదరభావాన్ని పెంపొందించే వేడుక ‘అలాయ్ బలాయ్’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.

Alai Balai: సోదరభావాన్ని పెంపొందించే వేడుక ‘అలాయ్ బలాయ్’: రాష్ట్రపతి ముర్ము సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోదరభావాన్ని పెంపొందించే వేడుక ‘అలాయ్ బలాయ్’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే (Alai Balai) అలాయ్ బలాయ్ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రత్యేక సందేశం పంపారు. ‘అలాయ్ బలాయ్’ ఉత్సవాన్ని బండారు దత్తాత్రేయ ప్రారంభించారని, ఈ పండుగ తెలంగాణ ఆచారాలను పునరుద్ధరించి, ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ఉత్సవం నవరాత్రి వేళల్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరగాలని కోరుకున్నారు. కాగా, ప్రతి ఏట దసరా (Dasara) సమయంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహిస్తారు.

Next Story