హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం హకీంపేట్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో ఆమెకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి స్వాగతం పలికారు. కాగా, శీతాకాల విడిదిలో భాగంగా.. డిసెంబంర్ 17 నుంచి 22వ తేదీ వరకు అంటే.. మొత్తం ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. డిసెంబర్ 19వ తేదీన రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 11.00 గంటలకు ఈ ఫిలిం సిటీ వేదికగా జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. డిసెంబర్ 20వ తేదీన గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో జరిగే సదస్సుకు ముర్ము హాజరవుతారు. హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతకట్టుదిట్టం చేశారు. సైబరాబాద్ పరిధిలో డ్రోన్లు ఎగురవేతపై పోలీసులు ఆంక్షలు విధించారు. అల్వాల్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో 17నుంచి 22 వరకు డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్టుల ఎగురవేతపై నిషేధం విధించారు. భద్రతా చర్యల్లో భాగంగా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story