Sports Awards: జాతీయ క్రీడా అవార్డు ప్రదానం

by Prasad Jukanti |

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ క్రీడా అవార్డు ప్రదానం చేశారు.

Sports Awards:  జాతీయ క్రీడా అవార్డు ప్రదానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2024 ఏడాదికి గాను క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రమపది ముర్ము శుక్రవారం జాతీయ క్రీడా అవార్డులు (National Sports Awards) ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధాన్య్ చంద్ ఖేల్ రత్న (Khel Ratna) అవార్డును చెస్ విభాగంలో డి.గుకేశ్ (D.Gukesh), షూటింగ్ విభాగంలో మను బాకర్ (Manu Bakar), హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్ లు అందుకున్నారు. తెలుగు అథ్లెట్లు జ్యోతి యర్రాజి (Jyoti Yarraji), దీప్తి జీవాంజిల (Deepti Jeevanji) అర్జున అవార్డులు అందుకున్నారు. కాగా కేంద్రం ఇటీవల ప్రకటించిన క్రీడా పురస్కరాల్లో మొత్తం నలుగురికి ఖేల్ రత్న, 32 మందికి అర్జున్ అవార్డులు ముగ్గురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులను ప్రకటించారు. వీరందరికి ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు.

Next Story