శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతకు సన్నాహాలు.. మంత్రికి ఆహ్వానం

by Malleboina Mahesh |   (  Updated:2025-07-07 12:02:05  IST  )

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో ఆ నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుకుండా మారిపోయాయి.

శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతకు సన్నాహాలు.. మంత్రికి ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains)కు కృష్ణా నది (Krishna river)కి వరద పోటెత్తింది. దీంతో ఆ నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుకుండా మారిపోయాయి. దీంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత రెండు వారాలుగా జూరాల ప్రాజెక్ట్ (Jurala Project) నుంచి శ్రీశైలం జలాశయానికి భారీ వరద వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండుకుండలా మారిపోయింది. అలాగే ఆల్మట్టి ప్రాజెక్టు (Almaty project) నుంచి భారీగా వరద నీరు వస్తుంది. సోమవారం ఉదయం నాటికి జూరాల నుంచి 1.98 లక్షల క్యూసెక్కుల వరద జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరాయి.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) నీటిమట్టం 880.40 అడుగులకు చేరింది. ఇది ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం అయిన 885 అడుగులకు కేవలం 5 అడుగులు తక్కువగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు గేట్లను ఎత్తేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది ఈ మేరకు శ్రీశైలం డ్యామ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భారీగా వరద వస్తుండటంతో రేపు సాయంత్రం - ఎల్లుండి ఉదయం గేట్లు ఎత్తేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడి(Minister Nimmala Ramanayake) కి ఆహ్వానం పంపారు. మంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే గేట్లను ఎత్తే అవకాశం ఉంది.

Next Story