- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Preity Zinta: హైదరాబాద్ తాడ్బండ్ హనుమాన్ మందిర్‌లో ప్రీతి జింటా ప్రత్యేక పూజలు
హనుమాన్ జయంతి (Hanuman jayanti) సందర్భంగా హనుమంతుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: హనుమాన్ జయంతి (Hanuman jayanti) సందర్భంగా హనుమంతుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం తెల్లవారు జాము నుంచే భక్తులు హనుమాన్ ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని పంజాబ్ కింగ్స్ ఓనర్, ప్రముఖ నటి ప్రీతి జింటా (Preity Zinta) దర్శించుకున్నారు. ఉదయం తాడ్‌బండ్ హనుమాన్ ఆలయానికి వచ్చిన ప్రీతి జింటా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తమ జట్టు విజయాన్ని కోరుతూ ప్రీతిజింటా హనుమాన్‌ని దర్శించుకున్నారు. అయితే, ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో తన ఫేస్‌ను చున్నీతో కవర్ చేస్తూ ప్రీతి జింటా ఆలయంలోకి వచ్చి, అధికారుల సమక్షంలో పూజలు నిర్వహించారు.
మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు శోభాయాత్ర జరుగుతోంది. కాగా, ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు ఆటల్లో వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ ఓటమి బాటపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ సన్‌రౌజర్స్‌కు కీలకంగా మారింది. అదేవిధంగా గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన పంజాబ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్‌ను మట్టి కరిపించాలని చూస్తోంది.






