- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Seethakka : తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు : మంత్రి సీతక్క
రాష్ట్రంలో వేసవి కాలంలో భూగర్భ జల మట్టంతో పాటు రిజర్వాయర్లలో నీటి నిల్వలు క్షీణిస్తున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాలో సమస్య(Drinking water supply)లు తలెత్తకుండా అధికార యంత్రాంగం ముందుస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)ఆదేశించారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో వేసవి కాలంలో భూగర్భ జల మట్టంతో పాటు రిజర్వాయర్లలో నీటి నిల్వలు క్షీణిస్తున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాలో సమస్య(Drinking water supply)లు తలెత్తకుండా అధికార యంత్రాంగం ముందుస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)ఆదేశించారు.
సచివాలయంతో ఆయా శాఖల అధికారులతో తాగునీటి వనరులు, ప్రస్తుత స్థితి..భవిష్యత్తు పరిస్థితులపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు.. రిజర్వాయర్ల నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, పంప్ హౌస్ మోటర్ల పనితీరును నిరంతరం పరిశీలిస్తూ, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించాలని ఈ సందర్భంగా సీతక్క సూచించారు.
అవసరమైతే జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నరు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భూగర్భ జలవనరులపైన, రిజర్వాయర్లపైన అధారపడి సాగుతున్న మంచినీటి పథకాలలో వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైతే ప్రత్యామ్నాయ చర్యలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.






