Airport Metro Pre Bid Meeting : ఎయిర్‌పోర్టు మెట్రో కోసం ప్రీ బిడ్

by Disha Web Desk 19 |
Airport Metro Pre Bid Meeting : ఎయిర్‌పోర్టు మెట్రో కోసం ప్రీ బిడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మెట్రో నిర్మాణం కోసం మంగళవారం ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీల ప్రీ బిడ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డితో పాటు ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. మంగళవారం (నేటి) నుంచి ఈనెల 13 వరకు కన్సల్టెన్సీల నుంచి బిడ్‌లను స్వీకరించనున్నారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్ల అంచనాతో 31 కి.మీ దూరం మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.

ఈనెల 9న మెట్రో నిర్మాణానికి రాయదుర్గంలో సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. ఐటీ హబ్‌ మైండ్‌ స్పేస్‌ (రాయదుర్గం మెట్రో స్టేషన్‌) నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 31 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైను నిర్మించనున్నట్లు తెలిపింది. మైండ్‌స్పేస్‌ నుంచి గచ్చిబౌలి, నానక్‌రాంగూడ జంక్షన్‌ల నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు కొత్తగా మెట్రో రైలు సౌకర్యం రానుంది.


Next Story

Most Viewed