- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం రైతులకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలి: హరీశ్ రావు
.తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో నడవాలని హరీశ్ రావు ఆకాంక్షించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు మరింత విజయాలు సాధించాలలని రైతులకు మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టేలా అమ్మవారిని ప్రార్థించానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దసరా సందర్భంగా సిద్దిపేట (Siddipet) పట్టణంలోని కోటిలింగాల దేవాలయాలలో జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ విజయదశమి మరెన్నో విజయాలను అందించాలని, మీ అందరి కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనసారా ప్రార్థించానన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. తెలంగాణ చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రమైనా, కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దశదిశను నిర్దేశించిందన్నారు. కేసీఆర్ ప్రారంభించిన పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని. మిషన్ భగీరథ, రైతు బంధు పథకం, మిషన్ కాకతీయ వంటి పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో దేశంలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని రైతు ఆత్మహత్యలను 95 శాతం తగ్గించి రైతుల జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.






