- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ - పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్.. హైదరాబాద్ వ్యాప్తంగా పూజలు, హోమాలు
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్(Asia Cup-2025 Final Match) కాసేపట్లో ప్రారంభం కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్(Asia Cup-2025 Final Match) కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ ఫైనల్‌లో తొలిసారి భారత్(India) - పాకిస్థాన్(Pakistan) తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానం వేదికగా ఈ రసవత్తర మ్యాచ్ జరుగబోతోంది. ఈ నేపథ్యంలో భారత్ గెలవాలని గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నగరంలోని దుర్గామాత మండపాల్లో హోమాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ మాదిరిగానే ఆసియా కప్ లోనూ పాక్‌పై భారత్ జైత్రయాత్ర కొనసాగించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. కొన్నిచోట్ల స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేశారు. వివాదాలు, రాజకీయాల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి భారత్ - పాక్ తలపడనుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.






