ప్రవళిక మరణం దురదృష్టకరం: మంత్రి కేటీఆర్

by Satheesh |   (  Updated:2023-10-18 17:36:18  IST  )

ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన యువతి

ప్రవళిక మరణం దురదృష్టకరం: మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన యువతి మర్రి ప్రవళిక కుటుంబసభ్యులను బుధవారం ప్రగతిభవన్‌కు పిలిపించారు. వారితో కేటీఆర్ భేటీ అయ్యారు. మృతిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రవళిక మృతికి శివరామ్ కారణం అని, అతడిని కఠినంగా శిక్షించాలని మంత్రిని కోరారు. ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవళిక మరణం దురదృష్టకరమన్నారు.

కుటుంబ సభ్యులను కేటీఆర్ ఓదార్చారు. ఈ బాధాకర సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు. డీజీపీతో మృతి ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. కేసు విచారణను మరింత వేగంగా పూర్తి చేయాలని డీజీపీకి సూచించారు. ప్రవళిక మృతికి కారణమైన శివరామ్‌కు తగిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన భరోసాకు ప్రవళిక కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Next Story